CPM ADONI

Directions

CPM ADONI పొలిటికల్ పార్టీ

 #ఆదోని  #పట్టణ  #పరిధిలో  #సిపిఎం  #పార్టీ  #అభ్యర్థులు... #కౌన్సిలర్ గా  #జరగబోతున్న  #ఎన్నికల్లో  #నిరంతరం  #ప్రజల  #...
17/10/2026

#ఆదోని #పట్టణ #పరిధిలో #సిపిఎం #పార్టీ #అభ్యర్థులు...
#కౌన్సిలర్ గా #జరగబోతున్న #ఎన్నికల్లో #నిరంతరం #ప్రజల #పక్షాన #పోరాడుతున్న #సీపీఎం #పార్టీ #అభ్యర్థులను #గెలిపించండి.

 #అర్బన్  #హెల్త్ 6  #సెంటర్‌ల లో  #రెగ్యులర్  #డాక్టర్‌స్ ను  #నియమించాలి. అన్ని రకాల  #మందులను ప్రభుత్వం సప్లై చేయాలి ...
09/10/2026

#అర్బన్ #హెల్త్ 6 #సెంటర్‌ల లో #రెగ్యులర్ #డాక్టర్‌స్ ను #నియమించాలి. అన్ని రకాల #మందులను ప్రభుత్వం సప్లై చేయాలి #సీపీఎం పార్టీ డిమాండ్***

పట్టణ పరిధిలోని శంకర్ నగర్ అర్బన్ హెల్త్ సెంటర్‌లో శాశ్వత వైద్యుడిని నియమించి, అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచాలని సీపీఎం పార్టీ డిమాండ్ చేసింది.

ఈ సందర్భంగా సీపీఎం పార్టీ పట్టణ బృందం శంకర్ నగర్ అర్బన్ హెల్త్ సెంటర్‌ను పరిశీలించింది. అనంతరం సీపీఎం పార్టీ పట్టణ కార్యవర్గ సభ్యులు గోపాల్, తిప్పన్న, ముక్కన్న మాట్లాడుతూ, ఆదోని అర్బన్ హెల్త్ 6సెంటర్‌లలో పర్మినెంట్ డాక్టర్ లేకపోవడం, అవసరమైన మందులు సక్రమంగా అందుబాటులో లేకపోవడంతో స్థానిక కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు వైద్య సేవలు పొందేందుకు ఇబ్బందులు పడుతున్నారని, అత్యవసర సమయాల్లో సరైన వైద్యం అందక ప్రజలు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన ప్రభుత్వం, అర్బన్ హెల్త్ సెంటర్‌లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.

ప్రభుత్వం తక్షణమే స్పందించి శంకర్ నగర్ అర్బన్ హెల్త్ సెంటర్‌లో పర్మినెంట్ డాక్టర్‌ను నియమించడంతో పాటు, అన్ని రకాల అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ నాయకులు తిక్కప్ప, నాగరాజు, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

జోహార్ కామ్రేడ్ మనోహర్ గారికి..
25/06/2026

జోహార్ కామ్రేడ్ మనోహర్ గారికి..

28/05/2026
 #కేరళ  #మాజీ  #సీఎం  #విజయన్  #పై  #ఈడీ  #దాడులను  #ఖండిస్తూ  #సీపీఎం  #నిరసన సిపిఎం పార్టీ పోలీట్ బ్యూరో సభ్యులు కేరళ ...
28/05/2026

#కేరళ #మాజీ #సీఎం #విజయన్ #పై #ఈడీ #దాడులను #ఖండిస్తూ #సీపీఎం #నిరసన
సిపిఎం పార్టీ పోలీట్ బ్యూరో సభ్యులు కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరాయ్ విజయన్ నివాసం మరియు వారి కుటుంబ సభ్యుల నివాసాలపై ఈడి దాడులను ఖండిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆదోని లోని అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన తెలియజేశారు.
ఈ సందర్భంగా సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు పి.ఈరన్న పట్టణ,మండల కార్యదర్శులు లక్ష్మన్న, లింగన్న మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఈడి మరియు సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థలను ఉపయోగించి ప్రతిపక్షాలను టార్గెట్ చేయడం పరిపాటిగా మారిందని ఇలాంటి దాడులను ప్రజలు ప్రజాస్వామికవాదులు తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందని వారు తెలిపారు.
గత పది సంవత్సరాలుగా కేరళను అభివృద్ధి పథంలో నడిపించి అవినీతి లేని రాష్ట్రంగా పేదరికం లేని రాష్ట్రంగా 100% అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా గుర్తింపు తీసుకొచ్చిన పినరాయ్ విజయన్ లాంటి మాజీ ముఖ్యమంత్రి పై ఈడి దాడులు అంటే హాస్యాస్పదంగా ఉందని వారన్నారు*.
సుమారు ఐదు గంటలపాటు జరిపిన దాడుల్లో ఏ ఒక్క ఆధారం లేక బిక్క మొఖం వేసుకొని ఈడి తిరుగు ముఖం పట్టాల్సి వచ్చిందన్నారు*. ఇలాంటి దాడులకు సిపిఎం పార్టీ నాయకులు గానీ కార్యకర్తలు గాని ఎవరు భయపడరని వీటిని ధైర్యంగా తిప్పి కొడతామని వారన్నారు.
ఇప్పటికైనా బిజెపి ప్రభుత్వం కుట్రపూరితమైన ఇలాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఉపయోగించి భయపెట్టాలని చూస్తే ఊరుకునేది లేదని తిరుగుబాటు చేయక తప్పదని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు పీఎస్ గోపాల్, మండల కార్యదర్శి వర్గ సభ్యులు ఉచ్చిరప్ప, పట్టణ నాయకులు కృష్ణమూర్తి, నాగరాజు, అజీమ్ ఖాన్, నాగేంద్ర, వెంకటేష్, నేతప్ప, తదితరులు పాల్గొన్నారు.

17/03/2026

ప్రభుత్వ అనుమతులు లేకుండా రంగురంగుల కాగితాలు, రాళ్లతో ప్రజలను ఆకర్షిస్తున్న అక్రమ వెంచర్ల పై చర్యలు తీసుకోవాలి....సిపిఎం......ఆదోని.
పట్టణం లోని విస్తరిస్తున్న తరుణంలో ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు రంగురంగుల కాగితాలు ముద్రించి ప్రజలను మభ్యపెడుతూ ప్రభుత్వం నుండి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా ఆకర్షణీయమైన వెంచర్లు వేస్తూ వ్యాపారం చేస్తున్న వెంచర్ల యజమాన్యంపై తగిన చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మన్న, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు గోపాల్, తిప్పన్న, మండల కార్యదర్శి లింగన్న, మున్సిపల్ కమిషనర్ నయీమ్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం వీరు మాట్లాడుతూ పట్టణంలోని నలుమూలలో ప్రభుత్వ అనుమతులు లేకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తు కొత్త కొత్త వెంచర్లు ఎస్టేట్ల పేర్లతో విచ్చలవిడిగా వ్యాపారం చేస్తున్న సంబంధిత అధికారులు చూసి చూడనట్లుగా ఉంటున్నారని వారు తెలిపారు. దీంతో పట్టణంలో నిత్యం కబ్జాల పేరుతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని వారు తెలిపారు .కావున ఇప్పటికైనా సంబంధం అధికారులు వెంటనే స్పందించి ప్రభుత్వ అనుమతులు లేకుండా పట్టణంలో అక్రమ వెంచర్లు వేసి ధనార్జన దేయంగా ప్రజలను మభ్యపెడుతున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుచున్నాము.

15/02/2026

#రాష్ట్ర #బడ్జెట్లో #కర్నూలు #జిల్లాకు #తీవ్ర #అన్యాయం... #సిపిఎం.... #ఆదోని.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో కర్నూలు జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగింది. రాష్ట్ర బడ్జెట్లో పత్తాలేని జిల్లా ప్రాజెక్టులు, కేటాయింపులు చేసిన వాటికి అంతంత మాత్రమేనిధులు, హైకోర్టు బెంచ్, ఆదోని మెడికల్ కళాశాల, కర్నూలు జిజిహెచ్ లాంటి వాటికి ప్రత్యేక నిధులు కేటాయించకపోవడం తీవ్ర అన్యాయమని జరిగిందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెంకటేశులు, సీనియర్ నాయకులు ఈరన్న తెలిపారు. ఆదోని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర బడ్జెట్ కు వ్యతిరేకంగా శ్రీనివాస్ భవన్ సర్కిల్ నందు సిపిఎం పట్టణ మండల, కార్యదర్శిలు లక్ష్మన్న, లింగన్న ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమం ఉద్దేశించి సిపిఎం నాయకులు వెంకటేశులు, ఈరన్న వీరు మాట్లాడుతూ బడ్జెట్లో జిల్లాకు మళ్ళీ మొండిచేయి చూపారు దీనికి కూటమి ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పాలని వారు తెలిపారు. బడ్జెట్లో జిల్లాకు ఎటువంటి ప్రత్యేక బడ్జెట్ కేటాయించలేదని వారు అన్నారు. ప్రాజెక్టుల నిర్వహణ కోసం కేవలం రూ 479 కోట్లు కేటాయించి చేతులు దులుపుకున్నారని వారు గుర్తు చేశారు. అభివృద్ధి కోసం గానీ, కర్నూలు జిల్లాలో పెండింగ్ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం గానీ, పరిశ్రమల కోసం ప్రత్యేక నిధులు కానీ, ఎక్కడ బడ్జెట్లో లేకపోవడం కూటమి ప్రభుత్వం జిల్లాకు నిర్లక్ష్యం చేస్తూ వచ్చిందని వారు తెలిపారు. జిల్లా ప్రజలు చాలా ఆశతో ఈసారైనా సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం కోసం నిధులు కేటాయించి వలసలు నివారిస్తారని ఆశించిన ప్రజల ఆశలు అడియాశలు అయ్యాయని వారు తెలిపారు. కర్నూలు జిల్లాలో కూటమి ప్రభుత్వానికి మంచి మెజార్టీ ఇచ్చినప్పటికీ ఈ ప్రాంతాన్ని విస్మరించడం సరైనది కాదని వారు తెలిపారు. ప్రధానంగా ఆదోని మెడికల్ కళాశాల ఉసే లేదని వారు తెలిపారు. కావున ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి బడ్జెట్ సవరణ చేస్తూ కర్నూలు జిల్లాకు నిధులు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు గోపాల్ తిప్పన్న, వీరారెడ్డి, వీరేష్, వెంకటేష్,నాగరాజు, తిక్కప్ప, నాగేంద్ర, కృష్ణమూర్తి, వీరేష్, సూరి, తదితరులు పాల్గొన్నారు.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) CPI(M)* ఆదోని మండలం.   తేదీ:24/12/2025గౌరవనీయులైన MPP గారికి  ఆదోని మండలం.విషయం* ...
24/12/2025

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) CPI(M)* ఆదోని మండలం.
తేదీ:24/12/2025
గౌరవనీయులైన MPP గారికి
ఆదోని మండలం.
విషయం* : ఇటీవలనే రాష్ట్ర ప్రభుత్వం
46 రెవెన్యూ గ్రామాలతో అతిపెద్ద మండలం గా ఉన్న ఆదోని మండలాన్ని రెండుగా చేస్తూ 17 గ్రామాలతో పెద్ద హరివణం మండల కేంద్రాన్ని విభజిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
పెద్ద హరివాణం మండల కేంద్రానికి సుమారుగా20 - 30 కిలోమీటర్లు దూరంలో ఉన్న గణేకల్లు,చాగి, కడితోట, నారాయణపురం, నాగనాతనహళ్లి దాణాపురం ,జి హోసళ్ళి,బసాపురం, మదిరే, గ్రామాలు పెద్ద హరివాణం లో కలపడం వల్ల రవాణా మరియు రాకపోకలకు చాలా ఇబ్బంది కలుగుతుంది.అలాగే దగ్గరగా ఉన్న గ్రామాలు సంతేకుడ్లురు, చిన్న హరివణం, చిన్న గోనెహాల్ గ్రామాల్లో కూడా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు.ప్రభుత్వం తక్షణమే పెద్దహారివాణం మండలంలో విలీనం చేసిన గ్రామాలలో గ్రామసభలు నిర్వహించి మండలంగా ప్రకటించాలని గతంలో సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది.
ఆదోని మండలం విభజన ఆశాస్త్రీయంగా జరిగిందని, స్థానిక ప్రజల మరియు ప్రజాప్రతినిధులతో ఎలాంటి సంప్రదింపులు జరుపుకుండా మండలాన్ని విభజించడం వల్ల ప్రజలు గందరగోళంలో ఉన్నారని, ప్రజలు, ప్రజా ప్రతినిధులు ఆందోళన చెందుతున్నారు. *ప్రభుత్వం పునరాలోచన చేసి ఈ గ్రామాలకు అందుబాటులో ఉన్న ఆదోనిలోనే కొనసాగించాలని కోరుతున్నాము. మండల సర్వసభ్య సమావేశం తీర్మానం చేసి జిల్లా కలెక్టర్ గారికి పంపాలని కోరుతున్నాము* ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కే లింగన్న మండల కార్యదర్శి వర్గ సభ్యులు బి వీరారెడ్డి, మండల కమిటీ సభ్యులు పాండురంగ, తిక్కప్ప, నారాయణపురం శాఖ కార్యదర్శి తాయన్న, మదిరే సిపిఎం పార్టీ సీనియర్ నాయకుడు చిన్న తిక్కన్న పాల్గొన్నారు.

అభివందనములతో
CPM పార్టీ మండల కమిటీ
ఆదోని మండలం.

Address

Adoni
518301

Website

Alerts

Be the first to know and let us send you an email when CPM ADONI posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category